VIDEO: ప్రజా దర్బార్‌లో అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే
కృష్ణా: బంటువల్లి మండలం టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ శనివారం ప్రజల వద్ద నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, ప్రజల సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకున్నారు. తమ సమస్యలకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యేకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.