బాలయ్య ఆధ్వర్యంలో హిందూపురంలో రేపు జాబ్ మేళా

బాలయ్య ఆధ్వర్యంలో హిందూపురంలో రేపు జాబ్ మేళా

సత్యసాయి: MLA నందమూరి బాలకృష్ణ సౌజన్యంతో హిందూపురంలో ఆదివారం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. సప్తగిరి డిగ్రీ కళాశాల వేదికగా జరిగే ఈ కార్యక్రమంలో 90కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయి. 5000కు పైగా ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జిల్లాలోని విద్యావంతులైన యువత ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.