రైల్వే ప్లాట్ ఫారమ్‌పై కుప్పకూలి వ్యక్తి మృతి

రైల్వే ప్లాట్ ఫారమ్‌పై కుప్పకూలి వ్యక్తి మృతి

మహబూబ్‌నగర్ జిల్లాలోని మన్యంకొండ రైల్వే స్టేషన్ ప్లాట్ ‌ఫారమ్‌పై శనివారం ఓ వ్యక్తి అకస్మాత్తుగా కుప్పకూలి మరణించాడు. మృతుడిని HYDలోని బహదూర్‌పురా కాలనీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ప్లాట్ ఫారమ్‌పై పడిపోయిన అతడిని గమనించిన స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సదరు వ్యక్తి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై పోలీసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.