VIDEO: జాతీయ జెండాకు అవమానం

SRD: జోగిపేట పట్టణంలో జాతీయ జెండాకు అవమానం జరిగింది. జోగిపేట పట్టణంలోని తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమైక్య భవనం వద్ద జాతీయ జెండాను తిరగేసి ఎగురవేశారు. జాతీయ జెండాను తిరగేసి ఎగరవేసి అలాగే వదిలి వెళ్లడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరగేసి ఎగరేసిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.