VIDEO: కర్నూలులో సందడి చేసిన ‘సైక్ సిద్ధార్థ్’ మూవీ టీం
KRNL: కొండారెడ్డి బురుజు వద్ద ‘సైక్ సిద్ధార్థ్’ మూవీ టీం ఇవాళ సందడి చేశారు. డిసెంబరు 12న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమెషన్స్‌లో భాగంగా నటుడు నందు, నటీ యామిని భాస్కర్ ఇక్కడికి చేరుకున్నారు. నటుడు నందు మాట్లాడుతూ.. ‘సైక్ సిద్ధార్థ్’ కుటుంబ సభ్యులతో కలిసి చూడాల్సిన సినిమా అని అన్నారు. ఈ చిత్రాన్ని అందరూ ఆదరించాలని కోరారు.