VIDEO: బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతున్న ఆలయం
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బద్దిపల్లి గ్రామంలోని అతి పురాతనమైన శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. ఈ నెల 25న ఉ. 6 గం.లకు బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 25 నుంచి 27 వరకు జరిగే బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.