ఉపాధి హామీ పనులు పరిశీలన

ఉపాధి హామీ పనులు పరిశీలన

KMR: సదాశివనగర్ మండలం పద్మాజివాడి చెరువులో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను సోమవారం ఏపీడీ, ఆర్‌డీఒ, ఏంపీడీవో పరిశీలించారు. ప్రతి రోజు ఉదయం 6 నుంచి 11 గంటలకు, రూ. 300 వచ్చేలా పనులు చేయాలని కూలీలకు సూచించారు. అనంతరం నర్సరీని పరిశీలించి మొక్కలు ఏపుగా పెరగడాన్ని చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, ఎఫ్‌ఏ వనిత ఉన్నారు.