మహిళకు వేధింపులు.. ZPTCపై కేసు నమోదు

మహిళకు వేధింపులు.. ZPTCపై కేసు నమోదు

పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసం ZPTC జయప్రకాష్‌పై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధిత మహిళ వివరాల ప్రకారం.. పెళ్లి పేరుతో జయప్రకాష్ మోసం చేశాడని, శారీరకంగా మానసికంగా వేధించాడని పేర్కొంది. అంతే కాకుండా రూ. 10లక్షల నగదు, బంగారం తీసుకున్నాడని చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.