VIDEO: వైభవంగా సీతారామచంద్రస్వామి విగ్రహ ప్రతిష్ఠ

WGL: పర్వతగిరి మండలం వడ్లకొండలో సీతారామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం వైభవంగా శుక్రవారం కొనసాగింది. గణపతి, శ్రీకృష్ణ, ధ్వజ, శిఖర, పూర్వక హనుమత్ లక్ష్మణ సహిత సీతారామచంద్ర స్వామి విగ్రహాలను రుత్విక్కుల వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రతిష్ట జరిపారు నిర్ణీత సమయానికి ధ్వజ స్తంభాన్ని ప్రతిష్టించారు. రామనామస్మరణలతో వడ్లకొండ మార్మోగింది.