MHBD ఆసుపత్రి ఘటనపై విచారణకు మంత్రి ఆదేశం
MHBD: జిల్లా ఆసుపత్రిలో గురువారం బతికి ఉన్న వ్యక్తిని మార్చురీకి తరలించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ విచారణకు ఆదేశించారు. మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, ముగ్గురు సీనియర్ ప్రొఫెసర్లతో ఒక కమిటీని నియమించారు.