రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
కృష్ణా: గన్నవరం నియోజకవర్గంలోని విజయవాడ రూరల్ మండలం అంబాపురం గ్రామంలో జరిగిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. గ్రామంలోని రైతులతో సమస్యలు, పంటల పై పరిస్థితులు, ప్రభుత్వ పథకాల అమలు పై వివరాలు తెలుసుకుని త్వరితగతిన పరిష్కారం కోసం అధికారులకు సూచనలు జారీ చేశారు.