పర్వతాల శివాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

పర్వతాల శివాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

వరంగల్: పర్వతగిరి మండల కేంద్రంలోని పర్వతాల శివాలయంలో నాలుగో వార్షిక మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయంలో గణపతి పూజ, మహాలింగార్చన, రుద్రాభిషేకం నిర్వహించనున్నారు. అర్చనలు, దంపతుల హోమాలు, సాయంత్రం శివపార్వతుల కళ్యాణం, అర్ధరాత్రి లింగోద్భవ మహాపూజ, మంగళహారతి కార్యక్రమాలు ఉంటాయి. ఉత్సవాల సందర్భంగా భక్తుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు.