'ప్రాథమిక విద్యకు పునాది అంగన్వాడీ కేంద్రాలు'
PDPL: అంగన్వాడీ కేంద్రాలు ప్రాథమిక విద్యకు పునాది అని పత్తిపాక సర్పంచ్ శ్రావణి పేర్కొన్నారు. ఇవాళ పత్తిపాక-1, లంబాడి తండా, నర్సింగాపూర్ అంగన్వాడి కేంద్రాల ఆధ్వర్యంలో నిర్వహించిన పోషకాహారోత్సవంలో ఆమె పాల్గొన్నారు. అంగన్వాడీ టీచర్లు పిల్లల ఎదుగుదల, టీకాల నమోదు, పౌష్టికాహారం గురించి వివరించారు. బాలమేళా, గ్రాడ్యుయేషన్ డే నిర్వహించి సర్టిఫికెట్లు అందజేశారు.