ఫుట్ పాత్ ఇలా.. నడిచేది ఎలా?

ఫుట్ పాత్ ఇలా.. నడిచేది ఎలా?

సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని ఫల పరిశోధన కేంద్రం రోడ్డు నుంచి ఎస్పీ నివాసం వరకు ఫుట్ పాత్ అధ్వానంగా మారింది. ఫుట్ పాత్ కుంగిపోవడంతో నడిచే వారు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రోడ్డు మీద నుంచి నడుచుకుంటూ వెళ్తే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.