పులిచింతల నుంచి భారీగా వరద

కృష్ణా: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద వస్తోంది. గురువారం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 4.78 లక్షల క్యూసెక్కులుగా ఉందని, అవుట్ ఫ్లో 6.69 లక్షల క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 50.34 మీటర్లు, ప్రస్తుతం 31.385 మీటర్లుగా ఉంది. అధికారులు 15 గేట్లు ఎత్తి నీటిని ప్రకాశం బ్యారేజీకి విడుదల చేశారు.