29న కడపలో దివ్య బలి పూజ

KDP: రైల్వే స్టేషన్ రోడ్డులోని ఆరోగ్య మాత చర్చి మందిరంలో ఈనెల 29న దివ్య బలి పూజ నిర్వహించనున్నట్లు పీఠాధిపతులు పాల్ ప్రకాష్ తెలిపారు. ఈ మేరకు పతాకావిష్కరణ, నవదిన ప్రారంభ వేడుక, దివ్య బలి పూజ వంటి ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయన్నారు. కాగా, సాయంత్రం 5 గంటలకు ఈ ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభం అవుతాయని చెప్పారు.