అమ్మ వారి నూతన కమిటీ ఎన్నిక

W.G: ఆకివీడు శాంతినగర్ శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయం నందు ఆదివారం నూతన కమిటీని ఎన్నుకున్నారు. దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని నూతన కమిటీ తెలిపింది. గౌరవ అధ్యక్షుడిగా మాకా లక్ష్మణరావు, అధ్యక్షుడిగా బెవర తిరుపతిరావు, కార్యదర్శిగా బత్తిలి రవి, కోశాధికారిగా గొర్లి వెంకటరమణ, ఉపాధ్యక్షుడిగా బొంతాడ సుబ్రహ్మణ్యం ఎన్నికయ్యారు.