మరణంలో వీడని బంధం
NLG: భార్య మృతి తట్టుకొలేక భర్త మృతి చెందిన ఘటన శాలిగౌరారం మండలం మాధవరం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామంలో మామిడి ముత్తమ్మ(73) నిన్న ఉదయం 6 గంటలకు అనారోగ్యంతో మృతి చెందింది. ఈ విషయం తెలిసిన ఆమె భర్త సైదులు(79) ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన కుటంబ సభ్యులు ఆసుపత్రి తరలించగా, పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు.