ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల ఆందోళన

ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల ఆందోళన

TG: తిరుపతి వెళ్లాల్సిన విస్తారా విమానం ఇంకా బయలుదేరలేదు. హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఉదయం 6 గంటలకు విమానం తిరుపతి బయల్దేరాల్సి ఉండేది. దీంతో ఎయిర్‌పోర్ట్‌లో 70 మంది ప్రయాణికులు పడిగాపులు పడుతున్నారు. ఈ క్రమంలో అధికారులు పట్టించుకోవడం లేదని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.