BREAKING: పోలింగ్ ప్రారంభం
TG: రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ విడతలో మొత్తం 3,906 సర్పంచ్, 29,903 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ పోలింగ్ ముగియనుంది. 38,337 పోలింగ్ కేంద్రాల్లో 57,22,565 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. అనంతరం ఫలితాలు వెల్లడిస్తారు.