పోలీసులపై కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ విమర్శలు

KDP: రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా పనిచేయడం పోలీసులకు అలవాటైందని కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు ఇన్‌ఛార్జ్ ఇర్ఫాన్ బాషా విమర్శించారు. మంగళవారం ప్రొద్దుటూరులో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో జరిగిన జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోలీసుల తీరు విమర్శలకు తావిస్తోందన్నారు. ప్రజలను ఓట్లు వేయనీయకుండా పోలీసులు అడ్డుకోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.