వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే
ELR: ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని తెలిపారు. ఏలూరులోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే స్వయంగా ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. వారికి భరోసా కల్పించి, సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.