ఇద్దరు భార్యలతో నామినేషన్.. సర్పంచ్ ఎవరు
SDPT: అక్బర్‌పేట- భూమపల్లి మండలం జంగపల్లి సర్పంచ్ ఎన్నికల్లో భర్త తన ఇద్దరు భార్యలతో నామినేషన్లు వేయించడం ఆసక్తికరంగా మారింది. స్క్రూటినీలో ఏదైనా నామినేషన్ తప్పు జరిగితే తొలగిపోతుందనే భయంతో ఇద్దరి పేర్లను దాఖలు చేసినట్టు తెలిసింది. గడువు ముగియడంతో పోటీలో సవతులిద్దరూ మిగిలారు. వీరిలో ఒకరు నామినేషన్ ఉపసంహరించుకుంటే పదవి ఏకగ్రీవం కానుంది. వీరిలో సర్పంచ్ ఎవరో చూడాలి.