ప్రభుత్వ DLTC/ITIలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ELR: ఏలూరు ప్రభుత్వ DLTC/ITIలలో 2025-2026 విద్యా సంవత్సరంకు గాను మిగిలిన సీట్ల భర్తీకి మూడవ విడతగా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రభుత్వ ITI ట్రైనింగ్ అధికారి రామచంద్రరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వెల్డర్ ట్రేడ్‌లో ఖాళీలు ఉన్నాయన్నారు. అభ్యర్థులు 26వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా www.iti.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలన్నారు.