రెచ్చిపోయిన దొంగలు.. రూ.8 లక్షలు చోరీ

రెచ్చిపోయిన దొంగలు.. రూ.8 లక్షలు చోరీ

SRD: జహీరాబాద్‌లో పట్టపగలే రూ. 8 లక్షల చోరీ జరిగింది. తూముకుంటకు చెందిన నర్సింహారెడ్డి బ్యాంకులో నగదు డ్రా చేసి, భూమి రిజిస్ట్రేషన్ కోసం తహసీల్దార్ కార్యాలయం వద్ద బైక్ ఆపి లోపలికి వెళ్లారు. గుర్తుతెలియని దుండగులు బైక్ నుంచి ఆ నగదును ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చేపట్టారు.