ఫిబ్రవరి 6న మెట్టుగుట్టపై దుకాణాల వేలం

ఫిబ్రవరి 6న మెట్టుగుట్టపై దుకాణాల వేలం

HNK: కాజీపేట మండలం మడికొండ గ్రామ శివారులో ఉన్న శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి దేవాలయ ఆవరణలో ఫిబ్రవరి 6వ తేదీన దుకాణాల ఏర్పాటుకు వేలం వేయనున్నట్లు ఆలయ ఈవో శేషు భారతి తెలిపారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వచ్చే భక్తుల సౌకర్యార్థం దుకాణాల ఏర్పాటుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.