ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ క్షేత్రస్థాయి పరిశీలన
WGL: రేపు మూడవ విడత ఎన్నికలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్య శారద నర్సంపేట, ఖానాపూర్, చెన్నారావుపేట, నెక్కొండ మండలాల ఎంపీడీవో కార్యాలయాలను సందర్శించి పోలింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించారు. పోలింగ్ సామగ్రి పంపిణీ తదితర అంశాలపై సమీక్షించారు.