హెచ్ఐవి బాధితుల పట్ల వివక్ష చూపరాదు
VZM: ఎయిడ్స్ బాధితులపై వివక్ష చూపరాదని నెల్లిమర్ల సామాజిక ఆరోగ్య కేంద్రం ఇంఛార్జ్ సూపరింటెండెంట్ ఎం.తిరుమలదేవి అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా నెల్లిమర్ల పట్టణంలో సోమవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ బాధితులకు అండగా నిలవాలని చెప్పారు. హెచ్ఐవి సంక్రమణ మార్గాలు, నివారణ చర్యలు వివరించారు.