థార్ వాహనాన్ని ఢీ కొట్టిన ట్రక్

థార్ వాహనాన్ని ఢీ కొట్టిన ట్రక్

HYD: బేగంపేట్ బస్ స్టాప్ వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ థార్ వాహనాన్ని వెనుక నుంచి హెవీ లోడ్‌తో వస్తున్న ట్రక్ ఢీకొట్టింది. ఈ ధాటికి థార్ వాహనం వెనుక భాగం నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.  ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.