'నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలి'
ADB: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని మాజీ ఎంపీ సోయం బాపూరావు అన్నారు. బుధవారం ఉట్నూర్ మండలంలోని దంతంపల్లి గ్రామంలో ఆయన పర్యటించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. దశలవారీగా అర్హులందరికీ లబ్ధి చేకూరుతుందని బాపూరావు పేర్కొన్నారు.