స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జి నేడు ప్రారంభం
AP: విశాఖ స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జి ఇవాళ ప్రారంభం కానుంది. కైలాసగిరిపై ఈ బ్రిడ్జి అందుబాటులోకి రానుంది. ఇది దేశంలోనే అతిపొడవైన గాజు వంతెన. దీన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించారు. 40MM మందం కలిగిన ల్యామినేటెడ్ గాజు వినియోగించారు. ఈ గాజును జర్మనీ నుంచి దిగుమతి చేశారు. ఈ ప్రతిష్టాత్మకమైన గాజు వంతెనను ఎంపీ శ్రీభరత్, ప్రజాప్రతినిధులు ప్రారంభించనున్నారు.