VIDEO: ఎమ్మిగనూరు బస్టాండ్‌లో.. వ్యక్తి మృతి
KRNL: ఎమ్మిగనూరు బస్టాండ్లో విషాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్టాండ్‌లో తెర్నేకల్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సుమారు 65 ఏళ్ల వయసు గల వ్యక్తి అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లి, తిరుగు ప్రయాణం కోసం తెర్నెకల్ గ్రామానికి వెళ్లే సందర్భంలో మృతి చెందినట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.