వైసీపీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ రాజీనామా

PLD: చిలకలూరిపేట నియోజకవర్గ వైసీపీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ పదవికి దొడ్డా రాకేశ్ గాంధీ శనివారం రాత్రి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నానని, తన ప్రయాణంలో తనకు అండగా నిలిచిన మాజీ మంత్రి రజినికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఆయన పోస్ట్‌లో పేర్కొన్నారు.