నాగులవంచలో 33కెవి విద్యుత్ లైన్ ఏర్పాటు

KMM: ముదిగొండ మండలం పమ్మి నుంచి చింతకాని మండలం నాగులవంచ విద్యుత్ స్టేషన్ కు అదనపు ప్రయోజనం కొరకు 33 కెవి విద్యుత్ లైన్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు సోమవారం నాగులవంచలో NPDCL ఖమ్మం SE ఇనుగుర్తి శ్రీనివాసాచారి నూతన లైన్‌ను ప్రారంభించినారు. ఈ విద్యుత్ లైన్ వల్ల నాగులవంచ, చింతకాని, పందిళ్ళపల్లి సబ్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు.