'ఆర్టీసీ బస్ స్టాండ్‌లో ప్రజలు అవస్థలు'

NLR: గూడూరు ఆర్టీసీ బస్ స్టాండ్‌లో సోమవారం ఉదయం పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. దసరా సెలవులు ముగియడంతో అలాగే తీవ్ర తుఫాను కారణంగా దూర ప్రాంతాలకు వెళ్ళే ప్రజలు బసులు లేక, వర్షంలో షెల్టర్లు లేక చాలా ఇబ్బందులు పడ్డారు. అటు నెల్లూరు, తిరుపతి వైపు వెళ్ళే బసులు ప్రతి అరగంటకు పైన రావడంతో ఆర్టీసీ బస్ స్టాండ్ అంత జన సందోహంతో కిక్కిరిసింది.