'అగ్నిప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి'

'అగ్నిప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి'

AKP: అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక కేంద్ర అధికారి పీ.నాగేశ్వరరావు తెలిపారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా అనకాపల్లి రైల్వే స్టేషన్ వద్ద బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించి కరపత్రాలను పంపిణీ చేశారు. వాటర్, ఫోమ్ ద్వారా అగ్ని నివారణపై డెమో చూపించారు. LPG ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు.