గర్భిణీలకు పౌష్టికాహారం పంపిణీ

NLR: బుచ్చిపట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో దాతల సహాయంతో పౌష్టికాహారాన్ని గర్భిణీలకు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఛైర్‌పర్సన్ మోర్ల సుప్రజ, కమిటీ సభ్యుడు కోదండరామిరెడ్డి, వైద్య అధికారి పద్మజ, కౌన్సిలర్ వైష్ణవి పాల్గొని గర్భిణీలకు పౌష్టికాహారాన్ని అందజేశారు. గర్భవతులు తప్పనిసరిగా పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు.