ఆటో బోల్తా పడి వ్యక్తి మృతి

ఆటో బోల్తా పడి వ్యక్తి మృతి

ప్రకాశం: దర్శి మండలం తూర్పువెంకటాపురం వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో బోల్తా పడి వీర బ్రహ్మచారి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కార్పెంటర్ పని నిమిత్తం తూర్పువెంకటాపురంకు చెందిన వీర బ్రహ్మచారి దర్శికి వచ్చాడు. పని ముగించుకుని తిరిగి ఆటోలో వెళుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మురళీ తెలిపారు.