వినాయక విగ్రహాల నమోదు కోసం చెక్ పోస్ట్ ఏర్పాటు

NZB: కమ్మర్ పల్లి మండల కేంద్రం శివారులోని శ్రీగిరి క్షేత్రం జంబి హనుమాన్ వద్ద 63వ నంబర్ జాతీయ రహదారిపై పోలీసులు చెక్ పోస్ట్‌ను ఏర్పాటు చేశారు. వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా గ్రామాల్లో ప్రతిష్టాపన కోసం తీసుకువచ్చే వినాయక విగ్రహాల నమోదు కోసం ఈ చెక్ పోస్ట్‌ను ఏర్పాటు చేసినట్లు కమ్మర్ పల్లి ఏఎస్సై నరేందర్ తెలిపారు.