'మలేరియా నియంత్రణకు 'ఫ్రైడే డ్రైడే' పాటించండి'
EG: అమలాపురం పాలగుమ్మి సచివాలయంలో జిల్లా మలేరియా అధికారి నక్క వెంకటేశ్వరరావు 'ఫ్రైడే డ్రైడే' కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దోమలు నీటిలో గుడ్లు పెడతాయని, పెద్ద దోమలను నాశనం చేయడం కష్టమని, కాబట్టి వారానికి ఒకసారి నిల్వ నీటిని పారబోయడం ద్వారా దోమల పెరుగుదలను అరికట్టవచ్చని ఆయన సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు.