నలుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్

BDK: అన్నపురెడ్డిపల్లి మండలంలోని కంపగూడెం సమీపంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు ఎస్సై చంద్రశేఖర్ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న నలుగురిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.20 వేల నగదు, నలుగు సెల్ ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిపారు.