పచ్చదనం-పరిశుభ్రతపై శిక్షణ కార్యక్రమం
KDP: సింహాద్రిపురంలోని ఎంపీడీవో కార్యాలయంలో గురువారం పచ్చదనం-పరిశుభ్రతపై సర్పంచులు, ఉపసర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా MPDO శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల్లో పచ్చదనం పెంపొందించడం, పరిశుభ్రత కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ప్రతి పంచాయతీలో చెట్లు నాటడం, చెత్త నిర్వహణ, స్వచ్ఛ గ్రామాల దిశగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.