'ఓటర్లు చేసిన తప్పును మరోసారి చేయొద్దు'

'ఓటర్లు చేసిన తప్పును మరోసారి చేయొద్దు'

NLG: చేసిన తప్పును మరొకసారి చేయొద్దని ఓటర్లకు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విజ్ఞప్తి చేశారు. కేతేపల్లి మండలం గుడివాడలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రాచకొండ సుమలతకు మద్దతుగా మంగళవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఒకరోజు సంతోషం కోసం ఐదు ఏళ్లు బాధపడొద్దని అన్నారు. ముందుగా కోలాట బృందం, డప్పుచప్పులతో కళాకారులు ప్రదర్శన చేపట్టారు.