రేపు కోదండరామస్వామికి హంస వాహన సేవ
KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు విశేష సేవలు నిర్వహించనున్నట్లు TTD వెల్లడించింది. ఉ. 8-10 గం. వరకు శ్రీరాముడు వేణుగోపాలుడిగా భక్తులకు దర్శనమిస్తారు. 11 గం. స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం, రా. 7-9 గం. వరకు జ్ఞానస్వరూపిగా హంస వాహనంపై స్వామివారి ఊరేగింపు ఉంటుంది. భక్తుల రద్దీ దృష్ట్యా అదనపు భద్రత, అన్నప్రసాద వితరణను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.