విద్య ద్వారానే సమ సమాజ మార్పు సాధించవచ్చు

విద్య ద్వారానే సమ సమాజ మార్పు సాధించవచ్చు

KMM: మధిర మండల పరిధిలోని చంద్రగూడెం గ్రామంలో శనివారం జ్యోతిరావు ఫూలే జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరై జ్యోతిరావు ఫూలే విగ్రహానికి నివాళి అర్పించారు. బడుగు బలహీన వర్గాల గొంతుక పూలే అని వారి జయంతి కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్లు అన్నారు. కేవలం విద్య ద్వారానే సమ సమాజ మార్పు సాధించవచ్చని వెల్లడించారు.