ఇళ్ల ముందు ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగలు

ఇళ్ల ముందు ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగలు

MNCL: కన్నెపల్లి మండల కేంద్రంలో కరెంట్ సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదకరంగా వేలాడుతున్న కరెంటు తీగలు, పాడైన స్తంభాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 4 నెలల క్రితం ధర్నా చేసినప్పుడు AE నరసింహులు హామీ ఇచ్చినా సమస్యలు అలాగే కొనసాగుతున్నాయన్నారు. అధికారులు స్పందించకపోతే సబ్ స్టేషన్ ముట్టడిస్తామని హెచ్చరించారు.