ఉపాధి హామీ పనులు ప్రారంభం
SDPT: మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలోని పాండురంగ చెరువు వద్ద ఉపాధి హామీ పనులు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. స్థానిక సర్పంచ్ కవిత రామ్మోహన్ రెడ్డి శాస్త్రోక్తంగా కొబ్బరికాయ కొట్టి ఈ పనులను ఘనంగా ప్రారంభించారు. అనంతరం ఆమె స్వయంగా గడ్డపార పట్టి తవ్వకం పనుల్లో పాల్గొని కూలీలను ఉత్సాహపరిచారు.