బీచ్ రోడ్డులో అమరవీరులకు పోలీస్ కవాతు

బీచ్ రోడ్డులో అమరవీరులకు పోలీస్ కవాతు

VSP: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (అక్టోబర్ 21) సందర్భంగా విశాఖపట్నం బీచ్ రోడ్డులో పోలీసులు ఆదివారం గౌరవ కవాతు నిర్వహించారు. దేశ రక్షణలో, విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన వీరజవాన్ల త్యాగాలను స్మరించుకుంటూ.. పోలీసులు కట్టుదిట్టమైన క్రమశిక్షణతో కవాతు చేశారు. సముద్రపు తీరాన జరిగిన ఈ పరేడ్ అమరుల స్ఫూర్తికి, పోలీసుల నిబద్ధతకు నివాళిగా నిలిచింది.