VIDEO: 'అక్రిడిటేషన్ కార్డులు జర్నలిస్టులకు దక్కేలా చేస్తాం'
GDWL: జర్నలిస్టుల సంఘం (TUWJ -IUJ) 4 వ మహాసభను గద్వాల పట్టణంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి అతిథులుగా కలెక్టర్ సంతోష్ ,ఎస్పీ శ్రీనివాసరావు హాజరయ్యారు. జర్నలిస్టులు ప్రజల పక్షాన నిలిచి నిజాలను నిర్భయంగా రాయాలని, సమాజంలో వారి పాత్ర కీలకమని కలెక్టర్ అన్నారు. అక్రిడిటేషన్ కార్డులు అర్హులైన జర్నలిస్టులకే దక్కేలా అందరూ కృషి చేయాలన్నారు.