దీనస్థితి.. వృద్ధాశ్రమంలో చేరిన నటి వాసుకి
దీనస్థితిలో ఉన్న హాస్య నటి వాసుకి కోనసీమ జిల్లా బొబ్బర్లంకలోని శ్రీరామ వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్నారు. 'ఈ ఆశ్రమానికి వచ్చిన తర్వాత నా ఆరోగ్యం కాస్త మెరుగుపడింది. గతంలో నా కళ్లకు శస్త్రచికిత్స చేయించిన మంచు విష్ణుకు, నగదు సాయం చేసిన చిరంజీవి సోదరులకు, లోకేష్, CBNకు కృతజ్ఞురాలిని. నాకు పింఛనుతో పాటు రేషన్ కార్డు అందించాలని కోరుతున్నా' అని విన్నవించారు.